15-10-2025 04:09:20 PM
సాయిదుర్గతేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ‘ఎస్‌వైజీ యేటిగట్టు’. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ ప్రాజెక్ట్ సాయిదుర్గతేజ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రంగా మారనుంది. సాయిదుర్గతేజ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ బుధవారం ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘అసుర ఆగమన’ పేరుతో విడుదల చేసిన ఈ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘అసుర సంధ్య వేళ మొదలైంది’ అంటూ తేజ్ చివర్లో చెప్పిన డైలాగ్, అంతకు ముందు చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి.
కండలు తిరిగిన ఆ దేహాన్ని చూస్తుంటే సాయిదుర్గతేజ్ ఈ సినిమా కోసం ఎంతలా శ్రమించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో ఓ యోధుడిలా కనిపించేందుకు తేజ్ వ్యాయామం, కఠినమైన డైట్ అంటూ చాలా కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి వెట్రివేల్ పళనిసామి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చుతున్నారు. ఎడిటింగ్ బాధ్యతను నవీన్ విజయకృష్ణ నిర్వర్తిస్తుండగా, ప్రొడక్షన్ డిజైనర్‌గా గాంధీ నడికుడికర్ పనిచేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా వైడ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.