01-09-2025 11:16:26 PM
వడ్డేపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ వడ్డెర సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా గండికోట సంపత్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి అయిలమల్లు సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ జిల్లాలో వడ్డెర సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని గండికోట సంపత్ పేర్కొన్నారు. తన నియమకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు అయిలమల్లుకు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు మల్లికార్జున కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.