calender_icon.png 7 September, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీ కోసం రాజీలేని పోరాటం!

02-09-2025 12:00:00 AM

  1. రాజీ ప్రయత్నంలో ఓ ఎస్‌ఐ  ముగ్గురు కానిస్టేబుళ్లు 
  2. అంటూ ప్రచారం హెడ్ కానిస్టేబుల్‌పై చర్యలకు రంగం సిద్ధం?

పెన్ పహాడ్, సెప్టెంబర్ 1: వినాయక చవితి రోజునా పుల్లుగా మద్యం సేవించి ఓ హెడ్ కానిస్టేబుల్ విచారణకు వెళ్లగా ఆయన మద్యం  మత్తులో ఉండి తూళుతున్న వీడియోను ఆ గ్రామ యువకులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇదే వార్త విజయక్రాంతిలో సైతం ప్రచురితమైన విషయం విదితమే. అయితే  మొదటగా సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోలో మాట్లాడుతున్న యువకుని పిలిపించి హెడ్ కానిస్టేబుల్ పై పోలీసులు పిర్యాదు చేయించారు. 

ప్లేట్ ఫిరాయింపు..

రాజకీయ నాయకుల ప్రాబల్యమో.. ఉన్నతాధికారుల అండదండలో తెలీదు కానీ మొత్తానికి సదరు ఉద్యోగిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే హెడ్ కానిస్టేబుల్ కు, వీడియో పోస్ట్ చేసిన యువకుడికి మధ్య రాజీ కుదిర్చే మార్గం ఎంచుకొని అనారోగ్యం, బీపీ పెరిగిందని, టాబ్లెట్లు వేసుకుంటే ఓవర్ డోస్ కావడంతో కళ్ళు తిరగాయని, బండ మీద కూర్చున్నాడని.. మద్యం తాగలేదని ఆ గ్రామఫిర్యాది రైతుతో రాజీ సంతకాలు చేయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

రాజీ పనిలో ఓ ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు..

సదరు హెడ్ కానిస్టేబుల్ పై నామమాత్ర చర్యలు  మాత్రమే తీసుకోవాలంటే వీడియో రికార్డ్ చేసిన, వీడియోలో  వాయిస్ వినబడుతున్న యువకునితో రాజీ కుదిరించేందుకు జాతీయ రహదారి పక్కన గల ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ ఎస్‌ఐ, వేరువేరు స్టేషన్లలో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుల్స్ సోమవారం రంగంలోకి దిగినట్లు విశ్వసనీయంగా సమాచారం.

అంతేకాకుండా సదరు హెడ్ కానిస్టేబుల్ యువకుని ఇళ్ళు, సూర్యాపేటలో టీ స్టాల్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ  రాజీ కోసం ప్రయత్నం చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. సదరు యువకుడు ససేమెరా అనడంతో చెవులు దులుపుకొని వెళ్లినట్లు వినికిడి. ఇదిలా ఉండగా ఆరోగ్యం బాగాలేకపోతే విధులకు ఎందుకు వచ్చాడని, ఒకవేళ వచ్చినా ఆ కేసు విషయంలో ఇతనే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటూ స్థానికులు ప్రశ్నించుకుంటున్నట్టు తెలుస్తుంది. 

అతడు ఏదైనా టాబ్లెట్ వాడితే దాని ప్రభావం చేత కళ్ళు తిరగడం.. కుదురుగా కూర్చోలేకపోవడం జరగాలి కానీ మాటతీరు అలా ఎందుకు ఉంటుంది అంటూ స్థానికులు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. కాగా మండలంలో ఇతనిపై పలు ఆరోపణలు ఉన్నాయని,

అయినా అతనిని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. చర్చికుంటున్నారు.  ఇదిలా ఉండగా జరిగిన విషయంపై ఆరా తీసిన పోలీస్ ఉన్నతాధికారులు హెడ్ కానిస్టేబుల్ పై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.