calender_icon.png 20 August, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమాన్ని బోధించేదే సనాతనం

13-08-2024 01:20:30 AM

  1. రాముడి జీవితం అందరికీ స్ఫూర్తి
  2. శ్రీవిద్యాకోటి కుంకుమార్చనలో స్వామి అభిషేక్ బ్రహ్మచారి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): సనాతన ధర్మం శాశ్వత మైనదని, అది అందరి సంక్షేమాన్ని బోధిస్తోందని స్వామి అభిషేక్ బ్రహ్మచారి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని శ్రీకంచి కామకోటి పీఠంలో ఆదివారం నుంచి జరుగుతున్న యజ్ఞంలో భాగంగా శ్రీ విద్యాకోటి కుంకుమార్చన పూజలు సోమవారం కొనసా గాయి. లలితాదేవి అమ్మవారి విగ్రహం ఎదుట చీరలు, గాజులు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. రెండో రోజు సాగిన ఈ పూజలకు మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ సీనియర్ ఈటెల రాజేందర్, బీజేపీ నేత మాధ వీలత, ఎమ్మెల్యే ఎన్ రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ అధికార ప్రతినిధి సుభాశ్‌రావు, విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామి అభిషేక్ బ్రహ్మచారి మాట్లాడుతూ.. శ్రీరాముడి జీవితం నుంచి అందరూ నేర్చు కోవాలని సూచించారు. సమాజంలోని ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాలని, భారతమాత కీర్తి పెరగాలని లలితా మాతను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. యువచేతన జాతీయ కన్వీనర్ రోహిత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాలను సమాజ స్రవంతిలో అనుసంధానం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా రాజకీయ నాయకులు మాట్లాడకూడదని సూచించారు. 

ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్నారు. దేశాన్ని ముందుకు నడిపే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. మూడో రోజు పూజల్లో భాగంగా నేడు పూర్ణాహుతి కార్యక్రమం జరుగనుంది. కార్యక్రమంలో నవీన్‌రావు, జయపాల్‌సింగ్ న్యాల్, సౌరభ్‌సింగ్, విశ్వజీత్‌సింగ్, ముఖేష్‌పాండే, రాజీవ్‌రాయ్ అప్పు, రామ్మోహన్ రెడ్డి, జీవన్‌రావ్, సుధాకర్‌శర్మ, అర్పిత, లోకావాణి, నగేశ్, శివప్రసాద్, రాంబాబు, ఫణిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.