29 April, 2026 | 3:25 AM

బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి

29-04-2026 01:43 AM

డిప్యూటీ సీఎంను కోరిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అడివిలింగాల, లింగంపేట మండలంలోని లింగంపల్లి బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మదన్మోహన్రావు మంగళవారం హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు.

గత ఏడాది నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ఉధృతికి కొట్టుకు పోయిన వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గంలో పెండింగ్లో గల బిల్లులకు సంబందించిన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈవిషయమై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించినట్ల ఎమ్మెల్యే తెలిపారు.