calender_icon.png 14 August, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక దళారులను ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

14-08-2025 12:00:00 AM

జుక్కల్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : ఇసుక  దళారులను ఉపేక్షించేది లేదని జుక్కల్  ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో  ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, అధికారులతో  ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా లబ్ధిదారులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. లబ్దిదారుల ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలు తెలుసుకొని, ఇళ్ల నిర్మాణంలో ఉన్న ఎలాంటి అవక తవకలు, అవినీతి, ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మాట్లా డుతూ.. ప్రజా ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, పేదోడి సొం తింటి కల నెరవేర్చాలని చిత్తశుద్ధితో పని చే స్తోందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శర వేగంగా జరు గుతున్నాయని, జుక్కల్ నియోజకవర్గంలో కూడా దాదాపు అన్ని గ్రామాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. నియో జకవర్గంలో పూరి గుడిసె, పెంకుటిల్లు కనిపించకూడదు అనేదే తన లక్ష్యమని పేర్కొ న్నారు. ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చా రు. అర్హులైన వారు ఇంకా ఎవరైనా ఉన్నా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు.

లబ్దిదారులు ప్రభుత్వ అధికారుల సూచనలు పాటించి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ దశలను బట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లబ్దిదారుల అకౌంట్లో డబ్బులు అదేవిధంగా చూస్తానని అన్నారు. దళారులు ఇష్టారీతిగా ఇసుక రేట్లు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని, వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల అభ్యు న్నతి కోసమే పాటు పడుతుందన్నారు. ప్ర భుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త మీద ఉందని అన్నా రు. జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలతో పని చేస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ, అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న అధికారులను  అభినందించారు.  డివిజన్ నియోజకవర్గ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.