14-08-2025 12:00:00 AM
ఎమ్మెల్యేకు రేషన్ డీలర్ల సంఘం వినతి
మద్నూర్ ఆగష్టు 13(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగం సురేందర్ ఆధ్వర్యంలో మద్నూర్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు రమేష్ దేశాయ్ ప్రధాన కార్యదర్శి కాంబులే పవన్ ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు వినతి పత్రం అందించారు.
ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు ప్రకటించిన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటికి అమలు చేయించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల రేషన్ డీలర్ల అధ్యక్ష, కార్యదర్శులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యేను సన్మానించినట్లు వారు తెలిపారు. రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లు రూ.5 వేల గౌరవ వేతనం, ప్రతి క్వింటాలుకు రూ.300 కమిషన్ చెల్లించాలని, దిగుమతి హమాలీ రుసుము ప్రభుత్వమే భరించాలని కోరినట్లు తెలిపారు. ఈ 3 డిమాండ్లతో కూడిన వినత్పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేసినట్లు మద్నూర్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు.