15-10-2025 12:25:17 AM
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థి ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై రెం డు రోజులు గడిచినా ఇప్పటి వరకు ఆ పార్టీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ నుంచి ప్రధానంగా లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, పద్మ, ఆకుల విజయ పేర్లు ముందునుంచి వినిపిస్తున్నా కానీ, ఇం కా బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ నాయకత్వం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
బలమైన బీసీ నేతను బరిలోకి దించాలని జాతీయ నాయకత్వం భావిస్తోందని సమాచారం. ఈక్రమంలోనే ఓ మాజీమంత్రి కుమారుడి పేరుతో పాటు, గత బీఆర్‌ఎస్ హయాం లో హైదరాబాద్ మేయర్‌గా చేసి, ప్రస్తు తం కాంగ్రె స్‌లో ఉన్న ఓ బీసీ నాయకుని పేరు తెరపైకి వచ్చింది.