20-12-2025 07:36:57 PM
చేగుంట,(విజయ క్రాంతి): చేగుంట మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా నూతనంగా గెలిచిన చేగుంట పట్టణ గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ ని మైనంపల్లి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారికంగా ఎన్నుకోవడం జరిగింది. దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ ఆధ్వర్యంలో మండల పరిధిలోనీ కాంగ్రెస్, బిజెపి, బిఅర్ఎస్ తరపున గెలిచిన సర్పంచుల కూడికను ఏర్పాటు చేసి వారి ప్రోద్బలంతో మండల సర్పంచ్ ల పొరం అధ్యక్షులుగా సండ్రుగుస్రవంతి, సతీష్ ని ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు మండల ఉపాధ్యక్షులుగా గుర్జా కుంట సుకన్య నాగులు, , ప్రధాన కార్యదర్శి గా కోండి రాజ్యలక్ష్మి స్వామి ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో చేగుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు తాడేపు వెంగల్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్, జనరల్ సెక్రటరీ కోండి శ్రీనివాస్, మహేష్,చందాయిపెట్ సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా, కిష్టపూర్ సర్పంచ్ జ్యోతి శ్రవణ్, పోలిమామిడి సర్పంచ్ రాయపల్లి శ్రీనివాస్ రెడ్డి, చిన్న శివనూర్ సర్పంచ్ సుంచన్ కోట వరలక్ష్మి,అన్నంతసాగర్ సర్పంచ్ శ్రీధర్, కన్యారం సర్పంచ్ కర్రే పుష్ప,, రెడ్డిపల్లి సర్పంచ్ నర్సిములు,సోమ్లా తండా సర్పంచ్ ప్రవళిక రమేష్,తిమ్మాహి పల్లి సర్పంచ్ కుమ్మరి సత్యనారాయణ,సీనియర్ నాయకులు పూర్ర ఆగమయ్యా, యూవనాయకులు సండ్రు గు శ్రీకాంత్, రాజు, కన్యారం సతీష్,తదితరులు పాల్గొన్నారు.