17-04-2025 12:54:02 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 16 : కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో బుధవారం సమస్త మానవాళికి సకల శ్రేయోదాయకమైన శ్వినాయక స్వామి విశేషమైన సంకష్టహర చతుర్ధి హోమం నిర్వహించారు. సంకష్టహర చతుర్ధి విశేషంగా బుధవారం కలసిరావడం అందులో ఈ తెలుగు సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో మొట్టమొదటి సంకష్టహర చతుర్ధిగా వచ్చింది.
వినాయక స్వామికి విశేషమైన రోజు సంకష్టహర చతుర్ధి వచ్చిన సంధర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని మహాగణ పతి ఆలయంలో ఆలయ ఈవో లావణ్య ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, అలంకరణ చేసి సామూహిక గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్చారణలతో వైభవంగా జరిగింది. హోమంలో భక్తులు పాల్గొన్నారు.