17-04-2025 12:53:41 AM
షాద్ నగర్, ఏప్రిల్ 16: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ నూతన అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డిలు ప్రమాణ స్వీకారోత్సవంకు ముఖ్య అతిథులుగా హాజరై.... అభివృద్ధి కమిటీ చైర్మన్ బి.అనిత రెడ్డితో పాటు కమిటీ సభ్యులు పద్మా రెడ్డి, కె. రమేష్, డి. రమేష్, పి. శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ... శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ అభివృద్ధికి తన సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో షాద్నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, కొంకళ్ల చెన్నయ్య, రఘు నాయక్, బాబర్ అలీ ఖాన్, బాలరాజు గౌడ్, చల్ల శ్రీకాంత్ రెడ్డి, ఇబ్రహీం, హరినాద్ రెడ్డి, జాం గారి రవి, జంగ నర్సింహులు, చంద్రపల్ రెడ్డి, తుపాకుల శేఖర్, ముబారక్, ఖదీర్, అనిల్, రాయికల్ శ్రీనివాస్, బుడ్డ నర్సింహ, అంబటి ప్రభాకర్, యెన్నం శ్రీధర్ రెడ్డి, కొమ్ము కృష్ణ అశోక్ మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.