17-04-2025 12:54:17 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్ చెరు, ఏప్రిల్ 16 :రైతుల ఆర్థికాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం లక్డారం, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి గ్రామ పీఏసీఎస్ ల పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం వడ్లకు క్వింటాలకు రూ.500ల బోనస్ అందిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రుద్రారం పీఏసీఎస్ అధ్యక్షులు పాండు, ముత్తంగి పీఎసీఎస్ అధ్యక్షులు బిక్షపతి, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, మేరాజ్ ఖాన్, అశోక్, కిట్టు, రామకృష్ణ, డైరెక్టర్లు, అధికారులుపాల్గొన్నారు.