calender_icon.png 16 May, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైశాఖ మాసంలో వచ్చిన సంకష్టహర చతుర్థి

16-05-2025 02:14:57 PM

విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుడు

మంథని, (విజయ క్రాంతి): వైశాఖ మాసం శుక్లపక్షంలో శుక్రవారం రోజున వచ్చిన సంకష్ట చతుర్థి(Sankashti Chaturthi) ఎంతో ప్రసిద్ధిగాంచినది. సరస్వతి నది(Saraswati River)లో వచ్చే పుష్కరాల సందర్భంగా సంకష్టహర చతుర్థి దీక్ష తీసుకునేవారు. ఈ రోజున చతుర్థి ఉపవాస దీక్ష స్వీకరిస్తారు. మానవులు దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించడానికి విఘ్నేశ్వరుని అనుగ్రహం ఎంతో ప్రధానమైనది.  మానవులకు ఏవైనా ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు ఉంటే ఈ సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం ఉంటే ఆ సమస్యలన్నీ తొలిగిపోవడానికి ఇది శుభదినం.

ఈ వ్రతాన్ని కృష్ణపక్షంలో ఉండే చవితి రోజున మొదలు పెట్టాలి. సంధ్యా సమయానికి చవితి తిథి ఉంటుంది. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి సంకష్టహర చతుర్థి. ఈ రోజున వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టి గరికతో సంకష్టహర వినాయకా అని స్మరిస్తూ పూజించాలి. ఈ విధంగా 21 నెలల పాటు ఈ వ్రతాన్ని చేస్తే సంకటాలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. సంకష్ట హర చతుర్థి పర్వదినమున పురస్కరించుకొని శుక్రవారం భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు. సంకటాలు తొలగించే సంకటహర చతుర్థి దీక్షతో భక్తులు పునీతులు అవుతున్నారు. సంకటహర చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులతో శ్రీ విఘ్నేశ్వర స్వామిని భక్తులు దర్శిం

చుకుని పునీతులయ్యారు. ప్రతి నెలలో ఒకసారి వచ్చే సంకటహర చతుర్థి పర్వదినం రోజున మంథని పట్టణంలోని శ్రీ మహాగణపతి దేవాలయం(Sri Maha Ganapathi Temple) శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం రాత్రి 10.06 గంటలకు చంద్రోదయం అనంతరం చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులు భోజనం చేస్తారు. ప్రాచీన కాలంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ మహా గణపతి మంథని పట్టణంలోని తమ్మిచెరువు కట్ట లో కొలువుతీరి ఉన్నారు. ఈ శ్రీ మహాగణపతి దేవాలయం అనాదిగా ఎంతో విశిష్టత సంతరించుకుంది. వైశాఖ మాసం వచ్చిన సంకట చతుర్థి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మహా గణపతిని దర్శించుకున్నారు.

సంకటహర చతుర్థి పర్వదినం రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామి కి 121 మోదకుడు సమర్పించడం అలాగే దూర్వాలు సమర్పించడం ఎంతో శ్రేయస్కరం అని భక్తుల విశ్వాసం. ప్రతినిత్యం ముఖ్యంగా ప్రతి మంగళవారం ఎందరో భక్తులు ఆలయంలో మహా గణపతిని దర్శించుకొని వెళుతుంటారు. ప్రతి మంగళవారం భక్తులు విగ్నేశ్వరుని పూజిస్తుంటారు. ముఖ్యంగా సంకటహర చతుర్థి రోజున మంథని పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. సంకటహర చతుర్థి దీక్ష పట్టిన భక్తులు రాత్రి చంద్రోదయం అనంతరం మాత్రమే ఉపవాస దీక్షను విరమిస్తారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అనేక రకాల పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో  స్వామి వారిని ఆలయ పూజారి పల్లి రాము భక్తులతో పూజలు చేయించారు.