28-10-2025 12:00:00 AM
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజీవ్‌రెడ్డి దర్శకుడు. నవంబర్ 14న రిలీజ్‌కు వస్తున్న నేపథ్యంలో మంగళవారం ఈ సినిమా నుంచి ‘తెలుసా నీ కోసమే..’ పాటను రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ ఈ పాటను బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా అర్మాన్ మాలిక్ మనసుకు హత్తుకునేలా పాడారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన గీతావిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సురేశ్‌బాబు మాట్లాడుతూ.. “సంతాన ప్రాప్తిరస్తు’ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ కావాలని కోరుకుంటున్నా” అన్నారు. హీరో విక్రాంత్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. ఫ్యామిలీ వ్యాల్యూస్ చెబుతుంది. ఎక్కడా అసభ్యత అనేది ఉండదు” అని తెలిపారు. ‘ప్రస్తుతం సమాజంలో కపుల్స్ ఎదుర్కొంటున్న సమస్య నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించామ’ని డైరెక్టర్ సంజీవ్‌రెడ్డి చెప్పారు.
నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. “పిల్లలు పుట్టకపోవడం అనేది బిజీ లైఫ్‌లో ఉన్నవాళ్ల జీవితాల్లో పెద్ద సమస్యగా మారింది. ఈ పాయింట్‌తో ఈ సినిమాను ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించాం” అన్నారు. సంగీత దర్శకుడు అజయ్ అరసాడ మాట్లాడుతూ.. “నేను ఇటీవల వరుసగా ఎంటర్‌టైనింగ్ మూవీస్ చేస్తూ వస్తున్నాను. ఇలాంటి టైమ్‌లో ప్రొడ్యూసర్ శ్రీధర్ పిలిచి ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా చూడమన్నారు. చూస్తున్నంత సేపూ ఎంతో ఆర్గానిక్ ఫీల్ కలిగింది. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్న క్రమంలోనే ‘తెలుసా నీ కోసమే’ పాటను కంపోజ్ చేశాం. బీజీఎం నుంచి వచ్చిన సాంగ్ ఇది. శ్రీమణి బ్యూటిఫుల్ గా రాశాడు, అర్మాన్ బాగా పాడాడు” అన్నారు.