17-05-2025 12:49:23 AM
విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా!
మంథని, మే 16 (విజయక్రాంతి): సరస్వతీ పుష్కరాలు అద్భు తం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవా రం కాళేశ్వరంలో కుటుంబ సమేతంగా పుష్కరఘాట్ వద్ద ఉన్న సరస్వతీమాతను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంత రం త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. నదీమతల్లికి శాస్త్రోక్తంగా చీరను సారెగా సమర్పించారు. అనంతరం గోదావరి హారతిని భట్టి విక్రమార్క దంపతులు తిలకించారు.
భట్టి దంపతులకు మంత్రి శ్రీధర్‌బాబు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పు ష్కరాలు నిర్వహణ అదృష్టంగా భావిస్తున్నానని తెలిపా రు. సరస్వతీ పుష్కర ఏర్పాట్లు అ ద్భుతంగా, అనిర్వచనీయంగా ఉన్నాయన్నారు. పుష్కర స్నానంతో సకల సౌకర్యా లు, సౌభాగ్యాలు కలుగుతాయని, జీవితంలో ఏవైనా పొరపాట్లు, తప్పులు జరిగి ఉంటే పుష్కర స్నానంతో పరిసమాప్తం అవుతాయని అన్నారు.
కుటుంబంతో కలిసి సర స్వతీ పుష్కర స్నానం ఆచరించడం అదృష్టం గా భావిస్తున్నానని డిప్యూటీ సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. 12 రోజుల పాటు జరగనున్న పుష్కరాలకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారని రానున్న 10 రోజులు చా లా కీలకమని అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఎక్కడా చిన్న లోపం రాకుండా భక్తులందరికీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారని అన్నారు.
లక్షలాది మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. డిప్యూటీ సీఎం వెంట మంత్రి శ్రీధర్‌బాబు, రామగుం డం, భూపాలపల్లి ఎమ్మెల్యేలు మక్క న్ సింగ్, గండ్ర సత ్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్ ఉన్నారు.
రెండోరోజు పెరిగిన భక్తుల తాకిడి
సరస్వతీ పుష్కరాల్లో భాగంగా రెండవ రోజు పరిపూర్ణానంద స్వామి తన శిష్య బృందంతో శుక్రవారం తెల్లవారుజామున పుష్కర స్నానం ఆచరించారు. రెండోరోజు లక్షన్నర మంది భక్తులు పుణ్య స్నానమాచరించారని అధికారులు తెలిపారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలకు తరలిరావడంతో ఘాట్లు కిటకిటలాడాయి.
పుష్కర స్నానంతో పాటు భక్తులు నదీ తీరాల్లో హారతులు సమర్పిస్తూ, ధాన్యం చేస్తూ తమ ఆధ్యాత్మికతను చాటుకున్నారు. పుష్కర స్నానానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రత్యేకతను గుర్తించి దీప దానాలు, పిండ ప్రదానాలు, పితరులకు తర్పణాలు వదిలారు. సరస్వతి నవరత్నమాల స్తోత్రంతో తొమ్మిది హారతులను కాశీ నుంచి వచ్చిన పండితులు ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం తిలకించి, శుక్రవారం రాత్రి కాళేశ్వరంలోనే బస చేశారు. శనివారం ఉదయం కాళేలేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకున్న అనంతరం ఆయన తిరుగు పయణమయ్యారు. కాళేశ్వరంలో పరకాల ఎమ్మెల్యే రావిరి ప్రకాష్ పుణ్యస్నానం ఆచరించి, ఆలయంలో పూజలు పూజలు చేశారు.
జైళ్ల శాఖ స్టాల్ ప్రారంభం
కాళేశ్వరంలో పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులకు అందుబాటులో ఉంచేందుకు స్వచ్ఛమైన దేశీయ చేనేత వస్త్రాలను, అగర్‌బత్తులను అందుబాటులో ఉంచాలనే ఉద్దే శంతో పుష్కరాల వద్ద ప్రత్యేక స్టాల్‌ను ఏర్పా టు జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా ప్రారంభించారు. ఖైదీలు తయారుచేసిన వస్తువు లను విక్రయించేందుకు స్టాల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘మై నేషన్’, వేస్ట్ టు వెల్త్ అనే ఉద్దేశాలతో ఖైదీలలో నైపుణ్యాలను పెంపొందించి, ప్రజల్లో ఆదారాభిమానాలు పొందే లా జైలు శాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు: మంత్రి శ్రీధర్‌బాబు
పుష్కరాల్లో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశించారు. సమన్వయంతో పని చేయాలని సూచించారు. మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలు, సేవల గురించి తెలుసుకున్నారు.
టెంట్ సిటీకి సమీపంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆరోగ్య పరిరక్షణ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఆయనవెంట జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, పరిశ్రమల శాఖ జీఎం సిద్దార్థ ఉన్నారు.