calender_icon.png 23 August, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ముత్యాలమ్మకు బోనాలు

23-08-2025 02:47:22 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల(Valigonda Mandal) కేంద్రంలో శనివారం పొలాల అమావాస్య సందర్భంగా ఆర్యవైశ్యులు ముత్యాలమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు. ఆర్యవైశ్యులు ముత్యాలమ్మ గుడికి పెద్దఎత్తున తరలి, తాము కోరిన కోరిక నెరవేర్చాలని కోరుకుంటూ బోనాలు సమర్పించారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు బెలిదే శ్రీనివాస్ డోగిపర్తి సంతోష్ బచ్చు శ్రీనివాస్ అప్పిశెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.