calender_icon.png 23 August, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

23-08-2025 02:36:40 PM

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..

మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు.

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాల పై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇప్పటి వరకు 18 అవగాహన కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.  విద్యా సంస్థలకు వంద గజాల పరిధిలో ఎక్కడా కూడా టోబాకో, మధ్యం విగ్రహాలు జర్గకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో డ్రగ్స్ టెస్ట్ నిర్వహించేందుకు వీలుగా పోలీసు, ఎక్సైజ్ శాఖ వద్ద అవసరమైన మేర మూత్ర పరీక్ష కిట్లు అందుబాటులో పెట్టడం జరిగిందని అన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు.

డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన వివరిస్తూనే సమాంతరంగా వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం షాపులు మూసి వేయాలని, దీనికి సంబంధించిన ఆదేశాలను వెంటనే జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు. నిమజ్జనం సందర్భంగా జిల్లాలో ఎక్కడ మద్యం విక్రయాలు జర్గవద్దని అన్నారు. జిల్లాల ఎక్కడ కూడా గంజాయి సాగు జర్గకుండా పక్కా పర్యవేక్షణ ఉండాలని అన్నారు. గంజాయి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సహాయాన్ని రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గంజాయి కేసులలో నిందితులకు శిక్ష పడేలా చూడాలని అన్నారు. జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఎక్కడా కూడా పిల్లలకు సిగరెట్ లిక్కర్ అమ్మకుండా చూడాలని, దీనిపై గ్రామ పంచాయతీలలో తీర్మానాలు చేయాలని అన్నారు.

జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్ డ్రగ్ ఇన్స్ పెక్టర్ కు సూచించారు.చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశిస్తాయని అన్నారు. భావితరాలు మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని  కలెక్టర్ పేర్కొన్నారు. ఎస్పి మహేష్ బి గీతే మాట్లాడుతూ,జిల్లాకు గంజాయి రాకుండా జాగ్రత్తలు.తీసుకుంటున్నామని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం అన్ని శాఖల అధికారులు సమయంతో పని చేయాలని అన్నారు. జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికుల పై నిఘా పెట్టాలని అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల వేములవాడ ఆర్డిఓ లు వెంకటేశ్వర్లు రాధాబాయి వ్యవసాయ శాఖ అధికారి ఆఫజలి బేగం డిఇఓ వినోద్ కుమార్ మున్సిపల్ కమిషనర్లు ఎక్సైజ్ ఇరిగేషన్ లేబర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ డ్రగ్ ఇన్స్పెక్టర్  ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారులు  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.