23-08-2025 02:36:26 PM
హైదరాబాద్: బీహార్ ఎన్నికల్లో(Bihar Elections) మంచి వాతావరణం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాటామంతీ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్ కు ఆర్జేడీకి ఒక ఎజెండా అంటూ ఏమీ లేదని కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఆరోపించారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు. బీహార్ లో ఇల్లీగల్ ఓట్లు ఎక్కవ ఉన్నాయని ఆయన సూచించారు. హైదరాబాద్ లో డబుల్ ఓట్లు ఉన్నాయి.. దేశవ్యాప్తంగా ఉన్న సమస్య ఇదే అన్నారు. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ లో కాంగ్రెస్ ఎలా గెలిచింది.. దొంగ ఓట్లతో నేనా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
తీవ్రమైన నేరాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్రమంత్రులు రాజీనామా చేయాల్సిందేనని కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు. అంబర్‌పేటలోని సిపిఎల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నోట్‌బుక్‌లు సహా పాఠశాలకు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడం, నేటి ప్రకాశవంతమైన, ఉత్సాహభరితమైన విద్యార్థులతో ఆకర్షణీయమైన సంభాషణను కలిగి ఉండటం, వారి శక్తి, ఉత్సుకత మన దేశ గొప్ప భవిష్యత్తు కోసం ఆశను ప్రతిబింబిస్తాయని తెలిపారు.