calender_icon.png 23 August, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోరం కనుకయ్య..

23-08-2025 02:33:17 PM

గార్ల (విజయక్రాంతి): శుక్రవారం సాయంత్రం గార్ల-డోర్నకల్ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన బాదం సురేందర్ కుటుంబాన్ని ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) పరామర్శించి, సురేందర్ పార్దివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మృతుని కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గార్ల సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, గుండా వెంకట్ రెడ్డి, ధనియాకుల రామారావు, తాళ్లపల్లి కృష్ణ గౌడ్, మాజీ జడ్పిటిసి జాటోత్ ఝాన్సీ లక్ష్మి, భూక్య నాగేశ్వరరావు, హతి రామ్ నాయక్, షేక్ యాకుబ్ పాషా, కోళ్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.