calender_icon.png 22 January, 2026 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా పరిధిలోకి సరూర్ నగర్ చెరువు

22-01-2026 03:55:21 AM

  1. ప్రభుత్వ అనుమతులు రాగానే అభివృద్ధి పనులు 
  2. హైడ్రా కమిషనర్ రంగనాథ్

ఎల్బీనగర్, జనవరి 21 : ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే సరూర్నగర్ చెరువును హైడ్రా పరిధిలోకి తీసుకుని సమగ్ర అభివృద్ధి పనులు చేపడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సరూర్నగర్ చెరువు, ప్రియదర్శిని పార్కును సందర్శించారు. కమిషనర్ వెంట లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, హైడ్రా అధికారులు, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. సరూర్ నగర్ చెరువు విస్తీర్ణం, ప్రస్తుత పరిస్థితులు, మురుగు నీటి ప్రవా హం, ఎస్టీపీ ప్లాంట్ పనితీరు, ఇతర అంశాలను అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ... సరూర్నగర్ చెరువు అసలు విస్తీర్ణం సుమా రు 150 ఎకరాలు ఉండాల్సి ఉండగా, ప్రస్తు తం 90 ఎకరాలకు పరిమితమైందన్నారు. చెరు వు చుట్టూ బండ్ లోపల ఉన్న పూడిక తొలిగించి, చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే మార్చి నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామని, మొత్తం ఏడాది కాలంలో సరూర్ నగర్ చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హైడ్రా అడిషనల్ కమిషనర్ పాపయ్య, డీఎస్పీ తిరుమల్, డిప్యూటీ సిటీ ప్లానర్ రామ్ రెడ్డి, హైడ్రా ఇన్ స్పెక్టర్ సైదు లు, కన్సల్టెంట్ యూనస్, దేవేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ ఈఈ కార్తీక్, ప్రాజెక్ట్ ఈఈ రామకృష్ణ, శానిటేషన్ డీఈ చందన, టౌన్ ప్లానింగ్ ఏసీబీ ప్రతాప్, డీఈ రవిచంద్ర, ఏఈ సురేష్, నాయకులు ప్రవీణ్ రెడ్డి, ప్రే మ్నాథ్ గౌడ్, కందికంటి శ్రీధర్ గౌడ్, రామ్ రెడ్డి, రోహిత్, నరేందర్, శ్రీనాథ్, శోభి, ధనరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.