calender_icon.png 22 January, 2026 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పక్కా ప్రణాళికతోనే బల్దియా విభజన

22-01-2026 03:50:20 AM

  1. ఫిబ్రవరి 10న స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తాం
  2. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
  3. జీహెచ్‌ఎంసీలో విస్తృత స్థాయి సమీక్ష  
  4.   22 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 21 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విభజనపై నెలకొన్న ఉత్కం ఠకు త్వరలోనే తెరపడనుంది. బల్దియా విభజనపై వచ్చే నెల ఫిబ్రవరి 10వ తేదీన ప్రభు త్వం స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభా కర్ ప్రకటించారు. విభజన విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని, ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉందని స్పష్టం చేశారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ ఆర్‌వీ కరన్‌లతో కలిసి ఆయన ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రస్తుత పాలకమండలి గడువు మరో 20 రోజుల్లో ముగియనుందని, ఆ తర్వాత ప్రజా సమస్యలను పరిష్క రించే బాధ్యత పూర్తిగా అధికారుల భుజస్కంధాలపైనే ఉంటుందని మంత్రి తేల్చిచెప్పారు. 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్ల అధికారులతో సమన్వయం చేసుకుంటూ, క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కోటి మంది మహిళలను కోటీశ్వరు లను చేసే కార్యక్రమంలో భాగంగా గ్రేటర్‌లో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం నగరంలో 72,942గా ఉన్న స్వయం సహాయక సం ఘాల సంఖ్యను లక్షకు పెంచాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు.

గ్రామీణ ప్రాం తాల తరహాలోనే నగరంలోని మహిళా సం ఘాలకు కూడా 40 నుంచి 50 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించి, సెట్విన్ ద్వారా ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు.నగరంలో చేపట్టిన హెచ్ సిటీ , ఎస్‌ఆర్డీపీ, స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ పనులను నిర్ణీత గడువులోగా టైమ్ బౌండ్ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ స్వచ్ఛ బ్రాండ్ ఇమేజ్ అనేది ఘన వ్యర్థాల నిర్వహణపైనే ఆధారపడి ఉందని, పారిశుద్ధ్యంలో అలసత్వం వద్దని హెచ్చరించారు. సమావేశం అనంతరం 22 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషన ర్లు సృజన, వినయ్ కృష్ణారెడ్డి, అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.

ప్రతిపక్షాలకు ఓపెన్ ఛాలెంజ్ 

ఇదే సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రాజకీయ అంశాలపై కూడా స్పందిం చారు. సింగరేణిపై ఎలాంటి విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీఆర్‌ఎస్, బీజేపీలకు సవాల్ విసిరారు. రాష్ట్రానికి నిధుల కోసం కేంద్రాన్ని అడుగుదామంటే ప్రతిపక్ష నేతలు ముందుకు రావడం లేదని, పైగా సింగరేణిపై దుష్ప్రచారం చేస్తున్నారని మం డిపడ్డారు. 2014 నుంచి సింగరేణిలో ఇచ్చి న ఒకే ఒక్క కాంట్రాక్ట్ మినహా.. మిగతా కాంట్రాక్టులన్నీ ఎక్స్ట్రా నామినేషన్ పద్ధతిలో గానే ఇచ్చారని నిరూపించేందుకు నేను సిద్ధం. కిషన్ రెడ్డి, హరీష్ రావులకు నా సవాల్ స్వీకరించే దమ్ముందా అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఇస్తే.. ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చడానికి సింగరేణి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.