22-01-2026 03:52:34 AM
సికింద్రాబాద్ జనవరి21 (విజయ క్రాంతి): భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బోయిన్‌పల్లి న్యూ సిటీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది. ఈ వేడుకలను పురస్కరించుకొని స్వామివారి శోభయాత్ర చేపట్టడం ఆలయ సంప్రదా యం. ఇందుకోసం ప్రత్యేకంగా అలంకరించే రథంపై ఉత్సవమూర్తులను ఊరేగిం చడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ సం దర్భంగా నిర్వహించిన వెంకటేశ్వర స్వామి రథయాత్రకు బోయినపల్లికి చెందిన డంపు రు సుమంత్ రెడ్డి శిరీష దంపతులు 12 లక్షల రూపాయలతో నూతన రథము ను తయారుచేయించి, ఆలయ కమిటీ కి అందజేశారు.
ఈ నూతన రథం ప్రారంభోత్సవం రథ స్థల పూజ బోయిన్‌పల్లి సిండికేట్ బ్యాంకు కాలనీ లో నుండి బుధవారం అంగరంగ వైభవంగా నిరవహించారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షు డు జంపన ప్రతాప్, ఓల్డ్‌బోయిన్పల్లి కార్పొరేటర్ ముదం నర్సింహా యాద వ్‌లు అతి ధులుగా పాల్గొని నూతన రథానికి ప్రత్యక పూజలు నిర్వహించి, జై శ్రీరామ్ నమోవెంకటేశాయ అని నమస్మరణలు చేస్తూ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భాంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ఈ దేవాలయానికి రథాన్ని అందించిన సుమంత్ రెడ్డి శిరీష కుటుంభం సభ్యులకు అభినందనలు తెలిపారు.
భక్తులు దేవాలయాల అభివృధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు, జాతరలు, ఉచ్చవాలు హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఆలయాలకు వచ్చేలా వారికీ మన మన రామాయణం భగవత్ గీత లాంటి వాటిపైన అవగాహన కల్పిస్తూ ఆలయాలకు వచ్చేలా అవగాహన కలిపించాలన్నారు. రథ యాత్రలలో ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథాలలో ఊరేగించడం, రథాలను లాగం వల్ల మోక్షం లభి స్తుందని భక్తుల నమ్మకం. ఈకార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు, నారాయణ లక్ష్మ ణ్, యాదయ్య, సాంబశివరావులతోపాటు వివిధ ఆలయాల సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.