27-12-2025 03:45:08 PM
మన ఊరి లోని విద్యార్థులు మన పాఠశాలలోనే చదివించాలి
ప్రభుత్వ పాఠశాలలో సీతంపేట సర్పంచ్ ఇండ్ల కృష్ణవేణి సదానందం
ముత్తారం,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని, మన ఊరిలోని విద్యార్థులు మన పాఠశాలలోనే తల్లిదండ్రులు చదివించాలని సీతంపేట సర్పంచ్ ఇండ్ల కృష్ణవేణి సదానందం అన్నారు. శనివారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి విద్యార్థి మన ప్రభుత్వ పాఠశాలలోని చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఉచిత భోజనం పుస్తకాలు ఉచిత విద్య బోధన అందుతున్నాయని, దీంతో పేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని సర్పంచ్ తెలిపారు. ఇకనుంచి తల్లిదండ్రులు ఆలోచించి ప్రైవేట్ పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదివేల కృషి చేయాలని కోరారు. ఆమె వెంట గ్రామ మాజీ సర్పంచ్ పులిపాక నాగేష్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.