27-12-2025 12:00:00 AM
చిన్నంబావి, డిసెంబర్ 26 : మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఇటిక్యాల పెంటమ్మ ప్రారంభించారు. గొర్రెల పెంపకం దారులు సద్వినియోగం చేసుకొవాలని ఆమె అన్నారు. శుక్రవారం మండలంలోని లక్మీపల్లి గ్రామంలో ఉపసర్పంచ్ మురళి, వైద్య సిబ్బంది తోకలిసి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా 150 జీవాలకు ఉచితంగా నట్టాల నివారణ మందులను వేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గొర్ల కాపరులు తదితరులు పాల్గొన్నారు.