13-12-2025 02:46:28 PM
వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ స్వామి(Vemulawada temple) ఆలయ ప్రాంగణంలో ఉన్న విఐపి రోడ్డు, చెరువు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించే పనులను ఆలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో చేపట్టారు. రాబోయే రోజుల్లో సమ్మక్క సారక్క అమ్మవార్ల జాతరకు ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. చెరువు పరిసరాలు, రోడ్లు, ఆలయ ప్రాంగణం శుభ్రంగా ఉంచుతూ సానిటేషన్ మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నారు.భక్తులు సౌకర్యంగా, శుభ్రమైన వాతావరణంలో దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.