calender_icon.png 13 December, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హై అలర్ట్, ఉప్పల్‌లో భద్రత కట్టుదిట్టం

13-12-2025 02:34:51 PM

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం ఫుట్ బాల్ మ్యాచ్(Messi Match) జరగనుంది. మెస్సీ- సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే ఫుట్ బాల్ మ్యాచుకు(Messi-CM Revanth football match) అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు శాఖ మెస్సీ-సీఎం ఫుట్ బాల్ మ్యాచుకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ కు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కోల్ కతా ఘటనతో పోలీసు శాఖ మరింత అప్రమత్తమైంది. మెస్సీ మ్యాచ్ కు టికెట్లు ఉన్నవాళ్లకు మాత్రమే అనుమతించనున్నారు. ఫుట్ బాల్ మ్యాచుకు 34 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు.

ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు విదేశీయులు రానున్నారు. ఉప్పల్ స్టేడియం(Uppal Stadium), పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. మెస్సీ రాక దృష్ట్యా మూడంచెల భద్రత,  జెడ్ ప్లస్ భద్రతతో పాటు ప్రత్యేక బలగాలు మోహరించారు. 20 వాహనాల కాన్వాయ్ తో మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. ఫలక్ నుమా ప్యాలెస్ దగ్గర భారీ బందోబస్తు పెట్టారు. కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో(Kolkata Salt Lake Stadium) ఉద్రిక్తత చోటుచేసుకుంది.  టికెట్ కోసం రూ. 5000 నుంచి  రూ. 45 వేలు ఖర్చచేశామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మెస్సీని చూడలేకపోయారంటూ అభిమానులు మండిపడ్డారు. మెస్సీని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ వచ్చారు. మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంతో అభిమానులు ఆగ్రహించారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం(Rajiv Gandhi International Stadium) వెలుపల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లియోనెల్ మెస్సీ చిత్రాలతో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన 'గోట్ ఇండియా టూర్'లో భాగంగా శనివారం నగరానికి రానున్నారు.