calender_icon.png 13 December, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండవ పోలింగ్ కు వేళాయే!

13-12-2025 02:37:02 PM

నంగునూరు: నంగునూరు మండలంలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు.మండలంలోని మొత్తం 25 గ్రామ పంచాయతీలకు గాను,రెండు స్థానాలు ఏకగ్రీవం కాగా, 23 గ్రామ పంచాయతీ స్థానాలకు 84 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.మొత్తం 220 వార్డు స్థానాలకు గాను 40 స్థానాలు ఏకగ్రీవం కాగా 180 వార్డు స్థానాలలో 443 మంది పోటీలో నిలిచారు.మండలంలో ఏర్పాటు చేసిన 180 పోలింగ్ బూతులకు గాను, మొత్తం 476 మంది పీఓ, ఓపీఓ లు విధులు నిర్వర్తించనున్నారు.శనివారండిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద అధికారులు పీఓ, ఏపీఓ లకు బ్యాలెట్ బాక్సులు, ఓటరు జాబితాలు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రతా నడుమ అందజేశారు.ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనుంది.మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమై, ఫలితాలను వెంటనే ప్రకటించనున్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 100 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.