calender_icon.png 2 August, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐవోసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సతీశ్ కుమార్

02-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: పెట్రో మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) తాత్కాలిక చైర్మన్‌గా తెలుగు వ్యక్తి సతీశ్ కుమార్ వడుగూరి ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పూర్తికాలపు చైర్మన్ల నియామక ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున రెండు రోజుల క్రితమే ఐఓసీతో పాటు హెచ్‌పీసీఎల్‌కు తాత్కాలిక చైర్మన్‌గా రాజేశ్ నారంగ్‌ను కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ నియమించింది. సతీశ్ కుమార్ ప్రస్తుతం ఐవోసీ మార్కెటింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వెంకటేశ్వర వర్సిటీలో మెకానికల్ గ్రాడ్యుయేట్ అయిన సతీశ్ కుమార్ స్లోవేనియా వర్సిటీలో ఎంబీఏ పట్టా పొందారు.