13-10-2025 07:56:27 PM
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో గంజాయి మత్తుకు యువత విద్యార్థులు బానిసవుతున్నారు. మరిపెడ పట్టణంలోని ఎస్సీ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులు మత్తుకు బానిసయ్యారు. ఆ వ్యసనంలో కొందరు విద్యార్థులు దారి తప్పుతున్నారు. ఎస్సీ హాస్టల్ విద్యార్థులపై వార్డెన్ పర్యవేక్షణ లేకపోవడంతో హాస్టల్ పరిసరాల ప్రాంతంలోనే సిగరెట్లలో గంజాయి నింపుకొని తాగుతున్నారు. విద్య నేర్చుకోవలసిన వయసులో గంజాయి మత్తులో తూలుతూ క్రమశిక్షణరాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి సేవానంపై దారి తప్పుతున్న విద్యార్థులు. ఎస్సీ హాస్టల్ కు సమీపంలో సమీపంలో నివాసం ఉంటున్న కొందరు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులు హాస్టల్ విద్యార్థులే లక్ష్యంగా సరఫరా చేస్తున్నారు. మొదట కొందరు విద్యార్థులకు గంజాయి ఉచితంగా ఇచ్చి బానిస అయిన తర్వాత డబ్బులకు విక్రయిస్తున్నారని సమాచారం.