13-10-2025 08:02:35 PM
మల్యాల (విజయక్రాంతి): కొండగట్టు జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం శ్రీ వెంకట అన్నమాచార్య ట్రస్ట్ కరీంనగర్ వారిచే పన్నెండు హుండీలను విప్పగానే 81 రోజులకు గాను ఒక కోటి ఎనిమిది లక్షల 72,591 రూపాయల ఆదాయం, విదేశీ కరెన్సీ(55) నోట్లు, సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ కరీంనగర్ రాజమౌళి, స్థానిక సిబ్బంది సునీల్, హరిహరనాథ్, నీల చంద్రశేఖర్, అర్చకులు రామకృష్ణ, రఘు ఆలయ, ఏ. ఎస్.ఐ పోలీస్, మహిళా కానిస్టేబుల్, హోంగార్డు, బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.