calender_icon.png 10 January, 2026 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెంచు అశోక్ మాతృమూర్తికి సత్యవతి రాథోడ్ నివాళి

09-01-2026 12:42:22 AM

నూతనకల్, జనవరి 8: మండలంలోని మిర్యాల గ్రామానికి చెందిన ప్రముఖ జిల్లా నాయకులు మెంచు అశోక్  మాతృమూర్తి సక్కుబాయి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం నాడు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ మిర్యాల గ్రామంలోని వారి నివాసానికి చేరుకున్నారు.సక్కుబాయి  మృతి పట్ల ఆమె తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి నివాసంలో ఏర్పాటు చేసిన సక్కుబాయి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని కోరుతూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బోడ శ్రీను నాయక్,గండి విష్ణు గౌడ్,బొమ్మకంటి వెంకట్ గౌడ్,అనంతుల శ్రీనివాస్ (స్థానిక సర్పంచ్)వీరితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొని సక్కుబాయి  ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.