09-01-2026 12:43:40 AM
మానకొండూర్, జనవరి 8 (విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణ కేవలం పోలీసుల చర్యలతోనే సాధ్యం కాదని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండి, వాటిని బాధ్యతాయుతంగా పాటించినప్పుడే ప్రమాద రహిత సమాజం సాధ్యమవుతుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. గురువారం తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ‘జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం - 2026’ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిపి పాల్గొని రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునిల్, కళాశాల చైర్మన్ రమేష్ రెడ్డి, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ లు విజయకుమార్, రమేష్, ఇన్స్పెక్టర్ సదన్ కుమార్ పాల్గొన్నారు.