calender_icon.png 11 January, 2026 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కిమ్స్’లో ముందస్తు సంక్రాంతి సంబురాలు

09-01-2026 12:42:20 AM

ముకరంపుర, జనవరి 8 (విజయ క్రాంతి): నగరంలోని కిమ్స్ డిగ్రీ, పి.జి, హోటల్ మేనేజిమెంటు, లా, ఎంబీఏ కళాశాల, పావులోవు బి.ఇడి కళాశాలల్లో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గులను పరిశీలించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలల్లో నిలిచిన ముగ్గులను ఎంపిక చేసి విద్యార్థినులకు కిమ్స్ విద్యాసంస్థల వైస్ ఛైర్మెన్ సాకేత్ రామారావు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.