03-01-2026 04:23:30 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రిబాయి పూలే అని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ మహిళా కళాశాల మహేంద్ర హిల్స్ ప్రిన్సిపల్ డాక్టర్ స్నేహలత అన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలార్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్నేహలత మాట్లాడుతూ మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
సమాజంలో మహిళలకు సమాన హక్కులు, గౌరవం కల్పించేందుకు ఆమె చేసిన పోరాటం నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. విద్య సమాజ మార్పుకు బలమైన ఆయుధమని నమ్మి, అనేక అడ్డంకులను అధిగమించి ఆమె మహిళా విద్యకు బాటలు వేసిన తీరును గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనురాధ, విజయలక్ష్మి, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ సరోజతో పాటు కళాశాల ఉపాధ్యాయ బృందం పాల్గొని సావిత్రిబాయి ఫూలే సేవలను స్మరించుకున్నారు.