30-09-2025 04:24:35 PM
గుండాల (విజయక్రాంతి): మండలంలోని నూనెగూడెం గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎస్బీఐ మేనేజర్ సుద్దాల స్వనీత ఆదేశాల మేరకు ఫీల్డ్ ఆఫీసర్ ప్రభాకర్ గ్రామస్తుల సహకారంతో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్చతాహి సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ ప్రభాకర్ మాట్లాడుతూ భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, బ్యాంక్ సిబ్బంది నవీన్, గంగాధర్ రాజమల్లు, గిరిబాబు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.