calender_icon.png 26 August, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో 7,500 కోట్ల స్కామ్

03-07-2024 04:05:07 AM

  • ఇద్దరు భారత సంతతి వ్యాపారవేత్తలకు జైలు 

న్యూఢిల్లీ, జూలై 2 : అమెరికాలో ఇద్దరు భారత సంతతి వ్యాపారవేత్తలు రూ. 7,500 కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడినట్లు తేలడంతో చికాగో కోర్టు వారిద్దరికీ జైలు శిక్ష విధించింది. కంపెనీ క్లయింట్లు, రుణదాతలు, పెట్టుబడిదారులను మో సం చేసినట్లు తేలడంతో రిషి షాకు ఏడున్నరేళ్లు, శ్రద్ధ అగర్వాల్‌కు మూ డేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. వివ రాల్లోకి వెళ్తే.. భారత సంతతికి చెందిన రిషి షా, శ్రద్ధా అగర్వాల్‌లు 2006లో జౌట్‌కమ్ హెల్త్ పేరిట హెల్త్ మీడియా సంస్థను స్థాపించారు. ఈ కంపెనీ వివిధ మెడికల్ అడ్వ ర్టుజింగ్ ప్రకటనలు ప్రసారం చేస్తుంది.

ఈ సృజనాత్మక ఆలోచనకు అమెరికాలో మంచి స్పందన లభించడంతో కంపెనీలకి భారీగా కాంట్రాక్టులు లభించాయి. 2010 లో ఆ దేశ టెక్, హెల్త్ కేర్ ఇన్వెస్ట్‌మెంట్లలో ఉన్నత స్థా యికి చేరింది. దీంతో, భారీ పెట్టుబడులను ఆకర్షించింది. గోల్డ్‌మన్ సాక్స్, ఆల్ఫాబెట్, జేబీ ప్యాట్రిక్స్ వెంచర్ క్యాపిటల్స్ వంటి సంస్థలు కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. దీంతో, తక్కువ కాలంలో భారీ లాభాలు ఆర్జించారు. అయితే, మరిన్ని లాభాల కోసం కంపెనీ ఆపరేషనల్, ఫైనాన్షియల్ కార్యకలాపాలను పెంచి చూపించారు. కంపెనీ డెలివరీ చేయగలిగిన స్థాయి కంటే ఎక్కువగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు. మరోవైపు, రిషి షా విలాసవంతమైన జీవనశైలి ఇన్వెస్టర్లలో అనుమానాలు రేకెత్తించింది.

అతడు 10 మిలియన్ డాలర్లు వెచ్చించి ఇళ్లు కొనుగోలు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంపై వాల్ స్ట్రీట్ జర్నల్ 2017లో కథనం ప్రచురించింది. ఆ తర్వాత కంపెనీలో పెట్టుబడులు పెట్టిన గోల్డ్‌మన్ సాక్స్, ఆల్ఫాబెట్ వంటి ఇన్వెస్టర్లు కోర్టులో కేసు ఫైల్ చేశారు. రిషి షాపై 2023 ఏప్రిల్‌లో మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసు విచారణ జరిపిన న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తూ తాజా తీర్పు వెలువరించింది. 

అవును.. నేను నేరం చేశాను

అమెరికాలోని చికాగో ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల భారతీయ అమెరికన్ వైద్యురాలు మోనా ఘోష్ వైద్యం, ప్రైవేట్ బీమా సంస్థలకు లేని సేవలకు బిల్ చేయడం ద్వారా ఫెడరల్ హెల్త్‌కేర్ మోసానికి పాల్పడింది. ప్రసూతి సేవల్లో ఆమె ఈ మోసానికి పాల్పడినట్లు కోర్టులో అంగీకరించింది. నేరం అంగీకరించినందున ఆమెకు యూఎస్ జిల్లా న్యాయమూర్తి ఫ్రాంక్లిన్ 20 ఏళ్ల జైలు శిక్షను విధించారు. అయితే మోసపూరితంగా పొందిన రీయంబర్స్‌మెంట్లలో 1.4 మిలియన్ల డాలర్లకుమాత్రమే తాను జవాబుదారీగా ఉన్నానని మోనా తన అభ్యర్థన ఒప్పదంలో అంగీకరించింది. 2018 నుంచి 2022 మధ్యలో ఘోష్ ఈ అక్రమాలకు పాల్పడింది.