calender_icon.png 7 October, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి వ్యాపారులకు స్కానర్లు అందజేత

07-10-2025 06:43:10 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని వీధి వ్యాపారులకు డిజిటల్ లావాదేవీల కోసం పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన క్యూ ఆర్ కోడ్ స్కానర్లను మున్సిపల్ కమిషనర్ టి. రమేష్ అందజేశారు. మంగళవారం బల్దియా కార్యాలయములో లోక కళ్యాణ్ మేళాలో భాగంగా నిర్వహించిన కార్యక్రమములో కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందటంలో పోస్ట్ ఆఫీస్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు. పోస్టల్ బ్యాంక్ మేనేజర్ రాజేశ్ మాట్లాడుతూ పేమెంట్ బ్యాంక్ ద్వారా అందిస్తున్న అకౌంట్, జీవనజ్యోతి బీమా, ప్రమాద బీమా, డిజిటల్ లావాదేవిలు వినియోగించుకోమని సూచించారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ మేనేజర్ అలీమోద్దీన్, క్రాంతి కుమార్, మెప్మా సిఓ స్వరూప, ఆర్ పి లు అధిక సంఖ్యలో మహిళలు పోస్టల్ సిబ్బంది శ్రీకాంత్, మౌనిక, తిరుపతి, స్ట్రీట్ వెండర్స్ పాల్గొన్నారు.