calender_icon.png 7 October, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మ పీఠంపై దాడి హేయమైన చర్య

07-10-2025 06:52:03 PM

లౌకిక, ప్రజాస్వామిక, రాజ్యాంగ స్పూర్తిని కాపాడాలి..

నల్గొండ క్రైమ్: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) బిఆర్‌ గవాయ్ పైనే ఓ మతోన్మాది షూ విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కెవిపిఎస్, ప్రజాసంఘాల అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం కేసు విచారణ సమయంలో డయాస్‌ వద్దకు వెళ్లిన న్యాయవాది రాకేష్‌ కిషోర్‌ ఒక్కసారిగా తన స్పోర్ట్స్‌ షూ తీసి, సిజెఐపైకి విసిరే ప్రయత్నం చేయడం రాజ్యాంగ వ్యవస్థకు అవమానకరమన్నారు. భారత చరిత్రలో ఇది చీకటి రోజు అన్నారు. సనాతనం పేరుతో జరిగే దాడులను భారత సమాజం సహించదన్నారు.

అడ్వకేట్ దర్శనం నరసింహ మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తిపైన దాడి మాత్రమే కాదు, రాజ్యాంగంపై జరిగిన దాడి అన్నారు. సమిష్టిగా భారత సమాజం గవాయ్ కు సంఘీభావంగా, అండగా నిలవాలని కోరారు. ఈ ఘటనను న్యాయవ్యవస్థపై దాడిగా పేర్కొన్నారు. నిందితుడి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరి సాగర్ మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థపై దాడి జరిగి 24 గంటలు అవుతున్నా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి నోరు మెదపకపోవడం రాజ్యాంగం పట్ల రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఏ పాటి గౌరవం ఉందో ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. సనాతన ధర్మం అంటే దాడులు చేయడమా అన్నారు. వందేండ్ల ఆర్ఎస్ఎస్ సంఘపరివార్ శక్తులు నేర్పుతున్నది ఇదేనా అన్నారు. వందేళ్ల ఆర్ఎస్ఎస్ కార్యచరణ న్యాయ వ్యవస్థపై దాడి చేయడానికి సిద్ధమయిందా.! అన్నారు.

ధర్మ పీఠంపై దురాక్రమణ దాడి జాతి  విచ్చిన్నానికి నిదర్శనం అన్నారు. అంబేద్కర్ వ్రాసిన రాజ్యంగ ధర్మం కంటే ఈ భారత దేశంలో మరేధర్మం గొప్పది కాదన్నారు. షెడ్యూల్ క్యాస్ట్ కు చెందిన మేధావి ఆ వ్యవస్థ మీద కూర్చోవడం బిజెపి జీర్ణీంచుకోలేకపోతుందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు గోలి సైదులు ఐద్వా మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న  కెవిపిఎస్ పట్టణ కార్యదర్శి గాదె నరసింహ బొల్లు రవీందర్ కుమార్ మాల మహానాడు జాతీయ నాయకులు రేఖల సైదులు తదితరులు పాల్గొన్నారు.