03-08-2025 12:21:39 AM
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే నేడు ప్రమోషన్లకు సంబంధించి టీచర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. రేపు అభ్యంతరాల పరిష్కారం, ఈనెల 7న స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్2 హెడ్‌మాస్టర్‌గా ప్రమోషన్లను ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు కొందరు స్కూల్ అసిస్టెంట్లు కోర్టుకెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం.
స్కూల్ అసిస్టెంట్లు గతంలో గెజిటెడ్ హెడ్మాస్టర్ ప్రమోషన్లకు అవకాశమున్నా దూరం వెళ్లాల్సి వస్తుందని నాట్ విల్లింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు దగ్గరి పాఠశాలల్లో ప్రమోషన్ పోస్టింగ్ కోసం సీనియార్టీ లిస్టులో ముందు వరుసలో ఉండటంతో వారి తర్వాత ఉన్న స్కూల్ అసిస్టెంట్లు ఆందోళనలో ఉన్నారు. నాట్ విల్లింగ్ వారికి ఒక సంవత్సరం తర్వాత తిరిగి ప్రమోషన్ కౌన్సిలింగ్‌లో పాల్గొనవచ్చనే ప్రభుత్వ ఉత్తర్వులు లేవని బాధిత ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.