calender_icon.png 4 August, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ

03-08-2025 12:22:00 AM

-హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాలలో 55 వేల రేషన్ కార్డుల పంపిణీ

-ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నిరంతం ప్రభుత్వ పథకాల కొనసాగింపు

-రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

-హాజరైన జిల్లా కలెక్టర్ హరిచందన, జీహెచ్‌ఎంసీ కమీషనర్ కర్ణన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి) : హైదరాబాద్ నగరంలోని 15 నియోజకవర్గాలకు చెందిన 55 వేల మంది లబ్దిదారుల కు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని  నగర ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం ముషీరాబాద్‌లోని కషీష్ పంక్షన్ హాల్లో ప్రజా పాలనలో ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ కార్యక్ర మం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, జిల్లా కలెక్టర్ హరిచందన, జీహెచ్‌ఎంసీ కమీషనర్ కర్జన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు సుప్రియా నవీన్ గౌడ్, గౌసొద్దీన్, రవిచారి, పావని వినయ్ కు మార్ లతో కలిసి లబ్దిదారులకు రేషన్ కార్డుల ధృవపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడు తూ... గత 10 సంవత్సరాలుగా కొత్తగా పెళ్లి అయిన వారికి, నూతనంగా పేర్ల నమోదుకు అవకాశం ఉండేది కాదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్దిదారులందరికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

రేషన్ కార్డుల పంపిణీ. అవసరాలను బట్టి నిరంతరం కొనసాగే ప్రక్రియ అని అ న్నారు. నగరంలో మొన్నటి వరకు ఆషాడమాసం బోనాల పండుగ జరిగిందని, ఇప్పు డు శ్రావణమాస రేషన్ కార్డుల పంపిణీ పండుగ జరుగుతుందన్నారు. గతంలో రేషన్ కార్డుపై దొడ్డు బియ్యం ఇచ్చేవారని, అది పేదలకు ఇబ్బంది కరంగా ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం అందజేస్తుందన్నారు. ఇది గొప్ప సామాజిక మార్పు అని పేర్కొన్నారు. పేద ప్రజల్లో మార్పు రావాలని, ప్రభుత్వం మొదటి నుంచి  దృఢ సంకల్పంతో పనిచేస్తుందన్నారు.

ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు పడుతున్నాయని, అలాగే ప్రజలకు అం దించే సంక్షేమ పథకాలను ఏ ఒక్కటి ఆపడం లేదని పేర్కొన్నారు. 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం ఇచ్చిన మాటప్రకారం అందజేస్తుందని పేర్కొన్నా రు. ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత ప్ర యాణం, రైతు బరోసా పథకాలను కొనసాగిస్తున్నారని అన్నారు.

ముషీరాబాద్ ఎమ్మె ల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోకి పౌరసరఫరాల శాఖ సర్కిల్ 6, 8, 9 పరిధిలో నివసించే పేద ప్రజలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, అర్హులైన ప్రతి దరఖాస్తు దారునికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని ముషీరాబాద్ ఎమ్మె ల్యే ముఠా గోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. రేషన్ కార్డు లేనివారు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ రేషన్ కార్డు రాలేదని నిరాశ చెందవద్దని ఇంకా రేషన్ కార్డుల వెరిఫికేషన్ జరుగుతున్నదని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన పేర్కొన్నారు. ఇది చాలా పెద్ద ప్రక్రియ అని, రేషన్ కార్డు కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. జిల్లా వ్యాప్తం గా ప్రస్తుతం 55 వేల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. మరో లక్ష 30వేల దరఖాస్తులు పరి శీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.

2, 272 మంది లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను స్థానిక సర్కిల్ పరిధిలో అందజేస్తున్నామని,  త్వరలో అందరికి రేషన్ కార్డులు అం దజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ సర్కిల్-6 ఏఎస్‌ఓ  దీప్తి, వివిద మండలాలకు చెందిన ఎంఆర్వోలు, బీఆర్‌ఎస్ యువ నా యకుడు ముఠా జైసింహా, బీఆర్‌ఎస్ ఆరు డివిజన్ల ఆధ్యక్షులు వై. శ్రీనివాస్ రావు, శ్రీధర్‌రెడ్డి, వల్లాల శ్యామ్ యాదవ్, శంకర్ ముదిరాజ్, బల్లా శ్రీనివాస్ రెడ్డి, రాకేష్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు శివ ముదిరాజ్, షీన్‌ఐయాల్ రెడ్డి, శ్రీనివాస్, టి. సోమన్, ముచ్చకుర్తి ప్రభాకర్, పెంటారెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఆర్ కల్పనయాదవ్, వాజీద్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీసీనియర్ నాయకులు పెండం శ్రీనివాస్ యాదవ్, రాజ్ప్, మేడి సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.