బడిబాట మొక్కుబడి కారాదు
వేసవి సెలవులు ముగిసి తిరిగి పాఠశాలలు తెరిచే సమయం వచ్చింది. బడిబాట పట్టాలని రాష్ట్రప్రభుత్వం టీచర్లను ఆదేశాంచింది. బడిబాటలో ముఖ్యంగా స్కూళ్లలో కనీస సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు(యూనిఫామ్) లాంటి వాటిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికీ రాష్ట్రంలోనిచాలా చోట్ల విద్యార్థులకు యూనిఫామ్‌లు, పాఠ్య పుస్తకాలు అందలేదని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లూ ఎన్నికల హడావుడి కారణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయాలపై దృష్టిపెట్టలేదు. ఇకనైనా సమస్యలు పరిష్కరించి, బడులు తెరిచే సమ యానికి అందుబాటులో ఉండేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వ బడుల్లో చేరికలను పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే బడిబాట మొక్కుబడి కార్యక్రమంగా మారుతుంది.
-ఎం. కృష్ణయ్య గౌడ్ , చింతల్, హైదరాబాద్.






