calender_icon.png 12 January, 2026 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిఖిత హోమ్స్ ఆర్కేడ్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు

12-01-2026 12:33:21 AM

కోదాడ జనవరి 11: కోదాడ పట్టణంలోని కట్టకొమ్ము గూడెం రోడ్డు లిఖిత హోమ్స్ ఆర్కేడ్ ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, బాలికలు పెద్ద ఎత్తున పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. రం గురంగుల ముగ్గులతో పరిసర ప్రాంతం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సంప్రదాయ సంస్కృతి పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. మొదటి ప్రైస్ అమల, రెండవ ప్రైజ్ ఉష, మూడవ ప్రైస్ స్వాతి లకు బహుమతులను అందించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో పాల్గొన్న మహిళలు ఆనందం వ్యక్తం చేశా రు. ఈ కార్యక్రమంలో  కిరణ్, శ్రీదేవి కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.