calender_icon.png 20 May, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారుల దరఖాస్తుల స్క్రూటిని వేగవంతం చేయాలి

20-05-2025 01:31:38 AM

కలెక్టర్ హనుమంతరావు

చౌటుప్పల్, మే 19 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాములైన రాజీవ్ యువ వికాసం ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తు స్కూటీని ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ అనంతరం ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం లపై సంబంధిత శాఖల అధికారులతో దరఖాస్తుల స్క్రూటీని ప్రక్రియపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ రెండవ తేదీన రాజీవ్ యువ వికాస పథకం ఇందిరమ్మ ఇండ్లు పథకాలను అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను జారీ చేయవలసి ఉన్నందున స్క్రూటిని ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలన్నారు.

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం తగదని సత్వరమే పరిష్కరించాలని, అలాగే ప్రజా పాలనలో కూడా సుమారు 30 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి జెడ్పిసిఈఓ శోభారాణి డిఆర్డిఓ నాగిరెడ్డి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.