calender_icon.png 22 August, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళితున్ని సామూహికంగా బహిష్కరించడం అన్యాయం

22-08-2025 06:36:06 PM

నకిరేకల్,(విజయక్రాంతి): దళితుడు కులాంతర వివాహం చేసుకున్నాడని  కారణంగా సామూహికంగా బహిష్కరించడం అత్యంత అన్యాయం అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఈ సందర్భంగా చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చిట్యాల మండల కేంద్రంలో ఒక దళిత యువకుడు బీసీ యాదవ కులానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నారనే కారణంతో, యాదవులంతా కలిసి గ్రామ సభ పెట్టి దళితులను డప్పు కొట్టడానికి, కూలీకి పిలవకూడదని పేర్కొన్నారు.

డ్రైవర్లుగా తీసుకోకూడదని తీర్మానం చేసి కాగితం రాసి సంతకాలు చేయడం  అత్యంత అన్యాయమన్నారు. సామూహికంగా బహిష్కరించడం దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఘోరమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లకు పైగా గడిచినా కుల వివక్ష కొనసాగడంసిగ్గుచేటన్నారుగత పది రోజులుగా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దౌర్భాగ్యం. ప్రస్తుతం చిట్యాలలో అలజడి వాతావరణం నెలకొంది.

దళితులు ప్రాణభయంతో ఉన్నారని ఆయన అన్నారు. దళిత యువకులపై దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారని, తలలు పగలగొట్టారు. తీవ్రంగా దౌర్జన్యం జరిగిందని ఆయన తెలిపారు. దళితులపై జరిగిన ఈ దౌర్జన్యం, అవమానం, సామూహిక బహిష్కరణపై బాధ్యులైన వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చిట్యాల ఎస్ఐకి వినతిపత్రం సమర్పించారు.