22-08-2025 06:31:25 PM
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): నాను యూరియా, నానో డీఏపీలను వాడటం ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చునని తక్కువ మోతాదులో రసాయనాలు వాడడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని సంస్థాన్ నారాయణపురం మండల వ్యవసాయ అధికారి వర్షిత రెడ్డి అన్నారు. మండలంలోని చిమిర్యాల, నారాయణపురం గ్రామాలలోని రైతులకు నానో యూరియా నానో డిఏపిల వాడకం పైన అవగాహన కల్పించారు. ఒక ఎకరానికి 500 ఎంఎల్ నానో యూరియా సరిపోతుందని లీటర్ నీటిలో 4 ఎంఎల్ కలుపుకొని పిచికారి చేసుకోవాలని తెలిపారు. నానో యూరియా ద్వారా రైతులకు దిగుబడి పెరుగుతుందని రవాణా ఖర్చు తగ్గుతుందని సూచించారు.