calender_icon.png 8 November, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో తనిఖీలు

08-11-2025 12:58:32 AM

-ఓటమి భయంతోనే సీఎం రేవంత్‌రెడ్డి నీచ రాజకీయాలు

-బీఆర్‌ఎస్ నేతలు మర్రి జనార్దన్‌రెడ్డి, రవీందర్‌రావు

- రాత్రి మరోనేత జానీమియా ఇంట్లో సోదా.. ఎమ్మెల్యే పల్లాతో కలిసి నేతల ఆందోళన

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యం లో బీఆర్‌ఎస్ నాయకుల ఇళ్లల్లో శుక్రవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మోతీనగర్‌లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, రహ్మత్ నగర్‌లోని ఎమ్మెల్సీ తక్కళ్ల పల్లి రవీందర్‌రావు ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ క్రమంలో జనార్దన్‌రెడ్డికి, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మర్రి జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చి సోదాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.

తమ ఇంట్లో ఎన్నికల అధికారులకు పాత బట్టలు తప్ప ఏమీ దొరకలేదని ఎద్దేవా చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపిం చారు. కాంగ్రెస్ నాయకులు డబ్బులు పం చుకునేందుకు ప్రభుత్వం పెద్దలు పోలీసులను డైవర్ట్ చేశారని తెలిపారు. తమ ఇంట్లో ఒక్క రూపాయి కూడా దొరకలేదని, అసలు జూబ్లీహిల్స్‌కు సంబం ధం లేని తన ఇంట్లో తనిఖీలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిందెవరని అడిగితే ఎన్నికల అధికారుల వద్ద సమాధానమే లేదన్నారు.

రవీందర్‌రావు మాట్లాడుతూ... ఇంట్లో ఎవరూ లేని సంద ర్భం చూసి వాచ్‌మెన్‌తో డోర్ ఓపెన్ చేయించారని తెలి పారు. ప్రచారంలో ఉన్నప్పుడు దౌర్జన్యంగా అధికారులు ఇంట్లో కి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌తో తనకు సంబంధమే లేనప్పుడు తనిఖీలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే రేవంత్‌రెడ్డి ఇలాంటి నీచ రాజకీ యాలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారు.

ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని, ఎన్నికల సమయం లో భయభ్రాం తులకు గురిచేయాలని చూస్తున్నారు అని ఆయన ఆరోపించారు. దీనిపై స్పందించిన పోలీసులు తాము రూల్స్ ప్రకారమే తనిఖీలు చేస్తున్నామని, తమ మీద ఎవరి ఒత్తిడీ లేదని స్పష్టం చేశారు. రాత్రి ఎర్రగడ్డలోని ప్రేమ్‌నగర్ బీఆర్‌ఎస్ నేత జానీమియా ఇంట్లో ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు సోదా లు నిర్వహించాయి. దీంతోజనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఓడిపోతామన్న భయంతోనే అధికార పార్టీ సోదాలు చేయిస్తుందని ఎమ్మెల్యే ఆరోపించారు.