calender_icon.png 7 August, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరిట్ ఆధారంగానే సీట్లు

31-07-2025 01:19:50 AM

రాష్ట్ర గురుకులాల  కార్యదర్శి వర్షిణి

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): గురుకులాల్లో మెరిట్ ఆధా రంగానే సీట్లు వస్తాయని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి స్పష్టం చేశా రు. గురుకులాల అడ్మిషన్స్ మీద వస్తు న్న ఆరోపణలు అన్నీ తప్పని, ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించినట్లు అలుగు వర్షిణి తెలిపారు.  గురుకులాల్లో ఇంటర్ తప్ప 5 నుంచి 9 వ తర గతి వరకు సీట్లు అన్నీ నిండాయని ఆ మె తెలిపారు.

బుధవారం ఆమె ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయంలో మీడియా స మావేశం నిర్వహించారు. మెరిట్ లిస్ట్ ఆధారంగానే  సీట్లు భర్తీ చేశామని, సీట్లు ఇప్పిస్తామనే దళారులను నమ్మి మోసపోవదన్నారు. మిగిలిపోయిన గురుకులాల ఇంటర్ సీట్లు భర్తీ చేసేందుకు ఇవాళ (జూలై 31న) స్పాట్ అడ్మి షన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఖాళీల వివరాలు బుధవారం వెబ్‌సైట్లో ఉంచామని వెల్లడించారు.