calender_icon.png 8 December, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలి

08-12-2025 05:16:47 PM

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

గద్వాల: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల గోదాములో ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ సోమవారం సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనఖీలో భాగంగా కలెక్టర్ ఈ తనిఖీ నిర్వహించారు.

గద్వాల జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తో పాటు భద్రత నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ నిర్వహణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, గద్వాల తహసిల్దార్ మల్లికార్జున్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ కరుణాకర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.