08-12-2025 05:14:17 PM
పెద్దపెల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్..
అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదానం చేసిన అల్లంకి సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, జిల్లా రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు నగునూరి అశోక్ కుమార్, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, వాసవి మాత దేవాలయం చైర్మన్ చకిలం మారుతిలు అన్నారు. సోమవారం సుల్తానాబాద్ పట్టణంలోని నీరుకుల్లా రోడ్డులో గల శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములకు శివాలయం చైర్మన్ అల్లంకి భాగ్యలక్ష్మి సత్యనారాయణ, అల్లంకి మనిషా అరుణ్ కుమార్ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వద్ద మొదటగా పూజారి సద్దనపు రవీంద్ర చారి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకోవడం జరిగింది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్త బృందం పాల్గొన్నారు.