67 మందికి భద్రత తొలగింపు
- వీఐపీ భద్రత కోత జాబితాలో కీలక నేతలు
- 20 మంది మాజీ డీజీపీలకు కూడా...
- కొదరికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్‌ల ఉపసంహరణ
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణలో రాజకీయ నాయకుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుంది. ఇంటెలిజెన్స్ (ఐజీ) నేతృత్వంలోని సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 67 మంది ప్రముఖ రాజకీ య నేతలకు భద్రతను పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీఐపీ భద్రత కోత జాబితాలో కీలక నేతలతోపాటు 20 మంది మాజీ డీజీపీలు కూడా ఉన్నారు. మాజీ డీజీపీలు, కీలక అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్‌లను కూడా తొ లగించింది.
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, సదరు నేతలకు ఉన్న ముప్పు తీవ్రత ను అంచనా వేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించా యి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసి న ఈ వీఐపీ భద్రత కోత జాబితాలో ఉమ్మ డి నల్లగొండ జిల్లాకు చెందిన కీలక నేతలు ఉన్నారు. అందులో శాసనమండలి మాజీ డి ప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌కు ఇన్నాళ్లూ కొనసాగిన గన్‌మెన్ల భద్రతను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది.
అలాగే నల్లగొండ మున్సిపల్ మేయర్ భర్త, బీఆర్‌ఎస్ నేత కరీంఖాన్‌కు కేటాయించిన గన్‌మెన్లను కూ డా వెనక్కి రప్పించారు. వీరితోపాటు బీజేపీకి చెందిన మరో ఇద్దరు ముఖ్య నేతలకు ఉన్న భద్రతను సైతం హోంశాఖ రద్దు చేసిం ది. ఈ విడతలో భద్రత కోల్పోయిన వారిలో మెజార్టీ నేతలు మాజీ ప్రజాప్రతినిధులు, గత ప్రభుత్వ హయాంలో గన్‌మెన్లను పొం దిన వారేనని సమాచారం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సదరు నాయకులకు కేటాయించిన గన్‌మెన్లు అందరూ తక్షణమే హెడ్‌క్వా ర్టర్స్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ పరిణామం రాజకీ య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
20 మంది మాజీ డీజీపీలకు కూడా...
మాజీ డీజీపీలు, కీలక అధికారులకు బు ల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్‌లు తొలగిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు మాజీ డీజీపీలతో పాటు ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఉన్న ఉన్నతాధికారులకు కేటాయించిన భద్రతను భారీగా కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా సుమారు 20 మంది మాజీ పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ప్రస్తుతం విధుల్లో ఉన్న కొందరు అధికారు ల బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పోలీస్ శాఖ పూర్తిగా తొలగించింది.
భద్రతా సమీక్ష అనంతరం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మా రింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కోల్పోయిన వారిలో ప్రముఖ మాజీ డీజీపీలు స్వ ర్ణజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్‌రెడ్డి, అనురాగ్ శర్మతో పాటు పూర్ణచందరావు, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, నవీన్ చంద్, డానియల్, వెంకట్రామిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, డీటీ నాయక్, ఉమేష్ షరీఫ్, రవి గుప్తా వంటి పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు.
వీరితో పాటు ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఉన్న బుల్లెట్ ప్రూ ఫ్ వాహనాలను సైతం పోలీస్ శాఖ ఉపసంహరించుకుంది. కేవలం వాహనాలే కాకుం డా మాజీ డీజీపీలకు ఇన్నాళ్లూ కొనసాగిన ఎస్కార్ట్ వాహనాలను కూడా పూర్తిగా తీసివేశారు. విరివిగా ఉన్న గన్ మెన్ల భద్రతను చాలా వరకు కేవలం ‘వన్ ప్లస్ వన్’ కే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్ర స్థాయిలో భద్రతా అవసరాలు, ముప్పు తీవ్రతను అంచనా వేసిన తర్వాతే ఈ కీలక మా ర్పులు చేసినట్లు తెలుస్తోంది.






